హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న సమంత !
Published on Jun 18, 2018 8:20 am IST

ఈ ఏడాది ఇప్పటికే ‘రంగస్థలం, మహానటి, ఇరుంబు తిరై’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘యు టర్న్’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ ఏడాది మధ్యలో ఈ సినిమా విడుదలయ్యే సూచనలున్నాయి.

ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే సమంత మరొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు గిరిసయ్య డైరెక్ట్ చేయనున్నారు. ఈయన ఇంతకుముందు సందీప్ వంగ వద్ద ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి పనిచేశారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే ఈ ఆగష్టు నుండి మోదలయ్యే అవకాశాలున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook