సమంత వద్దకు మరో క్రేజీ ప్రాజెక్ట్

సమంత వద్దకు మరో క్రేజీ ప్రాజెక్ట్

Published on Jul 4, 2019 3:00 AM IST

సమంత కొన్ని రోజుల క్రితమే స్వయంగా చెప్పిన మాట చేస్తే మంచి సినిమాలే చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఈ మాటకు కట్టుబడే ఆమె సినిమాల్ని ఎంచుకుంటోంది. ఇప్పటికే ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఓ బేబీ’ ఈ నెల 5న విడుదలకానుండగా తమిళ హిట్ చిత్రం 96 యొక్క తెలుగు రీమేక్‌లో కూడా సమంత నటిస్తోంది. ఇది కాకుండా తమిళ సినిమా ఒకదానికి ఆమె సైన్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని గోపి నైనర్ డైరెక్ట్ చేస్తారట. గోపి నైనర్ గతంలో నయనతారతో ‘అరమ్’ అనే సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈయన సమంతతో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం చర్చలు సాఫీగానే సాగుతున్నాయని, సమంత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తమిళ సినీ వర్గాల టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు