త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఆ హీరోయిన్ ని రిపీట్ చేస్తాడా?

Published on May 27, 2020 4:08 pm IST

డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉంటారు. ఓ హీరోయిన్ తో సక్సెస్ అందితే రెండు మూడు సినిమాలకు ఆమెనే ఆయన తీసుకుంటాడు. జల్సా కోసం ఇలియానాను తీసుకున్న త్రివిక్రమ్ బన్నీ జులాయ్ మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. అరవింద సమేతలో ఎన్టీఆర్ సరసన చేసిన పూజ హెగ్డేను అల వైకుంఠపురంలో మూవీ కొరకు తీసుకోవడం జరిగింది. ఇక సమంతకు అయితే ఆయన మూడు చిత్రాలలో అవకాశం ఇచ్చారు. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అ ఆ చిత్రాలతో సమంత హీరోయిన్ గా నటించింది.

కాగా సమంతకు నాలుగో సారి ఆయన అవకాశం ఇవ్వనున్నాడని టాక్. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 30వ చిత్రంలో హీరోయిన్ సమంతను తీసుకునే అవకాశం కలదని ఓ రూమర్ బయటికి వచ్చింది. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ సరసన సమంత నటించే 5వ చిత్రం అవుతుంది. బృదావనం,రామయ్య వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాలలో వీరు కలిసి నటించారు. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More