దాదాపు 20 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల హవా మొదలైంది. ఇప్పటికే మహేష్ బాబు – వెంకటేష్ కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అక్కినేని ఫ్యామిలీ హీరోస్ నటించిన ‘మనం’ సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయాన్ని అందుకున్నాయి. ఇక్కడ చెప్పదగిన విషయం ఏమిటంటే ఈ మూవీస్ లో హీరోలు వేరైనప్పటికీ టాలీవుడ్ డ్రీం గర్ల్ సమంత మాత్రం కామన్ హీరోయిన్స్ గా కనిపించి మల్టీ స్టారర్ సినిమా అంటే హీరోయిన్ గా సమంత నే తీసుకోవాలి అనేలా స్పెషల్ గుర్తింపును తెచ్చుకుంది.
సమంత తెలిపిన తాజా సమాచారం ప్రకారం త్వరలో సమంత మరో మల్టీ స్టారర్ సినిమాకి సైన్ చేయనుంది. ‘ఎక్కువ శాతం నేను చేయబోయే మరో మల్టీ స్టారర్ మూవీ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాను. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే వివరాలను తెలియజేస్తానని’ సమంత ట్వీట్ చేసింది. కానీ సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తుండడం వల్ల తను చేయబోయే మల్టీ స్టారర్ సినిమా తెలుగులోనా? లేక తమిళంలోనా? అనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. మరి త్వరలోనే ఈ సస్పెన్స్ వీడిపోతుందేమో చూడాలి..


