హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘సిరిమల్లె శారీస్’ షోరూమ్‌ను పాన్ ఇండియా స్టార్ సమంత రుత్ ప్రభు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు భారీగా హాజరయ్యారు.
షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం సమంత మాట్లాడుతూ.. చీర ప్రతి అమ్మాయికి ఓ మంచి స్నేహితురాలి వంటిదని, ఇక్కడి కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. భారతీయ హస్తకళలు, చేనేత వస్త్రాలు మన దేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.
సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో షోరూమ్ ఏర్పాటు తమ బ్రాండ్ విస్తరణలో కీలక మైలురాయి అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూనే, నాణ్యమైన ఆభరణాలను అందిస్తామన్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్లను రూపొందిస్తామని వెల్లడించారు. ఈ షోరూమ్‌లో కాంచీపురం, బెనారస్, బ్రైడల్ వేర్, హ్యాండ్లూమ్ సహా అన్ని వయసుల వారికి నచ్చే ఆధునిక డిజైన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
