చైతూ అందం పై సమంత సైటర్..!

Published on May 22, 2020 9:22 pm IST

నిన్న సాయంత్రం రానా మిహికాల రోకా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, సమంత జంట కూడా పాల్గొంది. ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాగచైతన్య ఫొటోని షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమంత పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.దానికి కారణం ఓ పక్క భర్తను పొగుడుతున్నట్లుగా కామెంట్ పెట్టి బ్రాకెట్ లో సెటైర్ వేసింది

చైతన్య పై ఆమె చేసిన కామెంట్ కి అంతా అవాక్కవుతున్నారు. సమంత ఇంస్టాగ్రామ్ లో ‘అమ్మ, ఆంటీలు, చెల్లెల్లు, స్నేహితులు అందరిని పంపిన తరువాత ఇప్పుడే ఇన్ స్టాగ్రామ్‌కు సమయం చిక్కింది. నా భర్త చాలా హ్యాండ్సమ్‌గా వున్నాడు చూడండి. నా భర్త ప్రస్తుతం ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో దూకేసి ఉంటాడు` అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భర్త అందం పై ఆమె సెటైర్ ఏమిటో అర్థం కాలేదు ఎవరికీ.

సంబంధిత సమాచారం :

X
More