ఆ అదృష్టం సమంత ఒక్కదానికే దక్కిందట…!

Published on Jun 27, 2019 10:00 pm IST

సినీ పరిశ్రమలో అదృష్టం అంటే సమంతదే అని చెప్పాలి. టాలెంట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తీసిన “ఏమాయచేసావే” మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత కెరీర్, అప్పటి నుండి విజయవంతంగా సాగిపోతుంది. నటి అన్నాక ఒడిదుడుకులు,జయాపజయాలు సర్వసాధారణం. కానీ సమంత నటించిన సినిమాలు దాదాపు చాలా వరకు విజయవంతం అయ్యాయి. నాగ చైతన్యతో ప్రేమ వివాహనికి ముందు తరువాత కూడా సమంతకు అవకాశాలు తగ్గిన దాఖలాలు లేవు.

ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “ఓ బేబీ” మూవీ వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పరిస్థుతులపై స్పందించారు. కమర్షియల్ సినిమాలలో హీరోయిన్స్ నటించడానికి ఏమి ఉండదు అన్నారు. పెద్ద సినిమాలలో హీరోయిన్స్ కేవలం ఆడిపాడటానికే మినహా నటనకు ప్రాధాన్యం ఉండదు అని అన్నారు. కానీ తనకు మాత్రం కమర్షియల్ సినిమాలలో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో నటించే అవకాశం వచ్చింది,అందుకు ‘రంగస్థలం’ మూవీ నే ఉదాహరణ అన్నారు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ శాశ్వతం కాదన్నారు.

సంబంధిత సమాచారం :

More