‘శ్రీమంతుడు’ విజయంతో తెలుగులో అగ్రదర్శకుల్లో ఒకరుగా మారిన కొరటాల శివ, ‘జనతా గ్యారెజ్’ పేరుతో ఎన్టీఆర్‌తో భారీ బడ్జట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి లో షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా లో ఇప్పటివరకూ మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. తరువాత ఇటీవల ముంబై లో జరిగిన షెడ్యూల్ లో యన్. టి. ఆర్ పాల్గొన్న పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
తాజా ఇప్పుడు చెన్నై సుందరి సమంత జనతా గారేజ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. సమంత పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉండగా సమంత నితిన్ తో కలిసి నటించిన ’అ..ఆ’ సినిమా మే నెలలో విడుదల కానుంది.


