సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!

సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Published on May 6, 2026 7:01 PM IST

Maa-Inti-Bangaaram

స్టార్ బ్యూటీ సమంత నుంచి మన తెలుగులో రీఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సామ్ నటించిన ఆ సినిమానే ‘మా ఇంటి బంగారం’. తన భర్త రాజ్ నిడుమోరు కథతో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మేకర్స్ ఇది వరకే ఈ మే 15కి లాక్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ సమయం దగ్గరకి వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు. దీంతో సినిమా వాయిదా పడొచ్చు అనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా సినిమా వాయిదా కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో కొత్త డేట్ గా మేకర్స్ ఈ జూన్ 19న సినిమా వస్తున్నట్టు టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ అతి త్వరలోనే రానుంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా శ్రీముఖి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సమంతానే ఈ సినిమాకి నిర్మాణం వహించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు