ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమైన “ఓ బేబీ”.

Published on Jun 28, 2019 4:01 pm IST

లేడి డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “ఓ బేబీ”. కొరియన్ మూవీ “మిస్ గ్రాని”కి అనువాదంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువతిలో 70ఏళ్ల వృద్ధురాలి ఆత్మ ప్రవేశిస్తే ఆపై జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయనే విభిన్నకథాంశం ప్రధానంగా కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సురేష్ ప్రొడక్షన్స్,గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదుదలైన చిత్ర టీజర్, ప్రోమో సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ మేరకు చిత్ర బృదం ప్రకటించడం జరిగింది. సమంత సరసన హీరోగా నాగ శౌర్య నటిస్తుండగా,లక్ష్మీ,రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మిక్కిజె.మేయర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More