‘అభిమన్యుడు’ చిత్ర డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ ఫై హీరోయిన్ అక్కినేని సమంత పొగడ్తల వర్షం కురిపించారు. సైబర్ యుద్ధం మరియు డేటా దొంగతనం నేపథ్యం లో సాగే ఈ సినిమాలో హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించారు.ఈ చిత్ర తమిళ వెర్షన్ ‘ఇరుంబు తిరై’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
ఈ చిత్ర దర్శకుడు పి ఎస్ మిత్రన్ గురించి సమంత మాట్లాడుతూ ‘మిత్రన్ నరేషన్ నన్ను చాలా ఇంప్రెస్స్ చేసింది. ‘ఇరుంబు తిరై’ ఒక కమర్షియల్ చిత్రం అయినా సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండడం వలన ప్రేక్షకులు లాజిక్ తో కన్విన్స్ అవుతారు. నేను ఎక్కువగా కొత్త చిత్ర దర్శకులతో పనిచేయలేదు కానీ మిత్రన్ తో చేసిన తరువాత నా అభిప్రాయం మార్చుకున్నాను. మిత్రన్ దర్శకత్వంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా ఇక మీదట నూతన దర్శకులతో పనిచేయాలనుకుంటున్నాను’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే తన గత చిత్రాల్లోమాదిరిగా ఈ సినిమాలోఅందమైన మరియు అల్లరి పాత్రలో కనిపించనని చెప్పారు.


