‘ముద్దు’ నటనలో భాగమే – సమంత !

Published on Mar 23, 2019 11:21 am IST


శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

ఈ టీజర్ లో హీరోయిన్ దివాంశ కౌశిక్ తో చైతు ముద్దు షాట్ కూడా ఉంది. అయితే ఈ ముద్దు పై నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. ఇది కేవలం నటన మాత్రమేనని.. సినిమాలో పాత్ర మేరకు ముద్దు సీన్లు ఉంటాయని చెప్పుకొచ్చింది.

కాగా ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నాడు.

సంబంధిత సమాచారం :

More