ఫ్యాషన్ ట్రెండ్స్ పై స్పందించిన సమంత

ఫ్యాషన్ ట్రెండ్స్ పై స్పందించిన సమంత

Published on Jul 1, 2014 11:43 AM IST

Samantha

కొద్ది రోజుల క్రితమే టాలీవుడ్ బ్యూటీ సమంత ఫ్యాషన్ లో తీసుకుంటున్న బోల్డ్ స్టెప్స్ గురించి మీకు తెలియజేశాం. ప్రస్తుతం సమంత తన ఫ్యాషన్, స్టేట్ మెంట్స్ తో అందరినీ తనవైపు ఆకర్షించుకుంటోంది.

ఈ రోజు ఓ ఇంగ్లీష్ పేపర్ వారు సమంతపై ఓ స్పెషల్ ఆర్టికల్ రాసారు. అందులో సమంత బాలీవుడ్ స్టార్స్ ని ఫాలో అవుతోందని రాసింది. ఈ కామెంట్స్ పై సమంత కాస్త ఆగ్రహంగానే స్పందించింది. తను ఇండియాలో ఉన్న ఫేమస్ డిజైనర్స్ నుంచి ఉన్న స్టైల్స్ ని వాడుకుంటున్నానని తెలిపింది.

చెప్పాలంటే ఇటీవలే బాలీవుడ్ కి చెందిన చాలా ఫ్యాషన్ బ్లాగ్స్ కూడా సమంత ఫ్యాషన్ ట్రెండ్స్ ని పొగిడారు. దాంతో ఈ కామెంట్స్ పై సమంత ట్విట్టర్ లో ఓపెన్ అయిపొయింది.

సమంత వేసిన ట్వీట్స్

‘ఎప్పుడైతే ఒక డిజైనర్ ఒక కలెక్షన్ తో వస్తారో అప్పుడే వాళ్ళ దగ్గర ఆ సీజన్ కి సరిపోయేలా ఒకే డిజైన్ వేరు వేరు కలర్స్ లో ఉంటాయి’

‘ఇంటర్నేషనల్ కాకుండా నేషనల్ గుర్తింపు ఉన్న లేబుల్స్ అయితే.. వాటిలో ఎప్పుడు సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే. అనామిక ఖన్నా ధోతీ స్టైల్, అర్పిత కట్ వర్క్ బ్లౌస్ స్టైల్ ‘

‘ఇవన్నీ ఒక్క సెలబ్రిటీ కోసం ఒక్క పీస్ మాత్రమే తయారు చెయ్యరు. అవే మోడల్స్ షాప్స్ మరియు ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి’.

‘స్టైలింగ్ లో ఒకే రకంగా అనిపించే అవుట్ ఫిట్ వేసుకోవచ్చు లేదా ఒకేరకమైన అవుట్ ఫిట్ కూడా వేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి స్టైల్ ఉంటుంది’

‘నేను వండర్ఫుల్ డిజైనర్స్ చూపించిన వాటిలో నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకునేలా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే స్టైల్ కోసం మరింత కష్టపడతాను, అలాగే కాస్త ఫన్ ఉండేలా చూసుకుంటాను’

‘నేషనల్ లెవల్లో ఫ్యాషన్ బ్లాగ్స్ మరియు వెబ్ సైట్స్ అయిన హైహీల్స్, పింక్ విల్లా, మిస్ మాలిని లాంటి వాటి పని ఫాషన్ జీనియస్ ఎవరు? ఫ్యాషన్ డిజాస్టర్ ఎవరు?అని చూడడమే. అలాంటి వారే చాలా సార్లు నా స్టైల్స్ ని పొగిడారు’.

తాజా వార్తలు