ఆ విషయంలో ఎన్టీఆర్ తరువాతే అంటున్న సమంత

ntr2

లక్కీ గర్ల్ సమంత ఇటీవల ఓ బేబీ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. అంతకు ముందు చైతన్య హీరోగా వచ్చిన మజిలీ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. సమంత ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో దాదాపు విజయం సాధించినవే ఎక్కువ. అందుకే సమంతను లక్కీ హీరోయిన్ గా పిలుస్తారందరూ. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 96మూవీలో నటిస్తున్న సమంత మరో ఏ కొత్త ప్రాజెక్ట్ కొరకు సంతకం చేయలేదు. ఐతే ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కలదని మాత్రం వార్తలు వస్తున్నాయి.

కాగా మంచు లక్ష్మీ హోస్ట్ గా నిర్వహిస్తున్న లేటెస్ట్ టాక్ షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో పాల్గొన్న సమంత పెర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు అభిమానులతో పంచుకున్నారు. ఈ షోలో భాగంగా మీరు నటించిన హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరని అడుగగా ఆమె ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పిన సమంత ఆయన రిహార్సల్స్ లేకుండా సెట్స్ లో అవలీలగా స్టెప్స్ వేసేస్తారు అని అన్నారు. ఇక సమంత ఎన్టీఆర్ కలిసి నాలుగు చిత్రాలలో కలిసి నటించడం విశేషం. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు.

Exit mobile version