“ఫ్యామిలీ మ్యాన్ 2″లో సమంత ఇలా కనిపించనుందా?

Published on Sep 26, 2020 7:22 pm IST


ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ రంగానికి మరింత స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎన్నో మార్పులు వచ్చి ఎంటర్టైన్మెంట్ డిజిటలైజ్ అయ్యింది. దీనితో ఇంట్లోనే సినిమాలలానే వెబ్ సిరీస్ ల పేరిట అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ దొరికేస్తుంది. అయితే మన దేశంలో కూడా పలు స్ట్రీమింగ్ సంస్థల్లో అద్భుతమైన ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

అలాంటి సిరీస్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్లాన్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా స్ట్రాంగ్ కంటెంట్ తో కూడిన ఈ వెబ్ సిరీస్ మన దేశపు ప్రజల మన్ననలు అందుకుంది. అలాంటి ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ ఇపుడు అమెజాన్ ప్రైమ్ లో తొందరలోనే రానుంది.

ఇంత ఫేమ్ వస్తున్న ఈ వెబ్ సిరీస్ లలో చాలా మంది అగ్ర నటులే నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే ఈ సిరీస్ లో నటించేందుకు స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో సమంత రోల్ కు సంబంధించి తాజా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో సమంతా విలన్ రోల్ లో కనిపించనుందట. అది కూడా టెర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఉందనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More