ఓ బేబీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సమంత

Published on May 13, 2020 2:02 am IST

గత ఏడాది సమంత ఓ బేబీ మూవీతో మాయ చేసింది. ఆమె ఓ ప్రయోగాత్మక పాత్రలో అబ్బురపరిచింది. భారీ విజయం అందుకున్న ఆ చిత్రం డైరెక్టర్ నందిని రెడ్డి కి చాలా కాలం తరువాత మంచి హిట్ అందించింది. ఇక యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. కాగా నేడు సమంత ఆ సినిమా నుండి ఓ ఫోటోని పంచుకున్నారు.

సీనియర్ నటి లక్ష్మీ తో పాటు సమంత ఉన్న ఆ ఫోటోని షేర్ చేసి ఆ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను పంచుకుంది. ఇక ఈ ఏడాది సమంత నటించిన జాను ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఐతే నటిగా సమంతకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ఓ టి టి ఎంట్రీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :