స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నందినీ రెడ్డి దర్శకత్వంలో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ అద్భుతమైన ఆదరణ పట్ల చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
సమంత ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై స్పందించింది. సినిమా కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించిందని.. యూత్ నుంచి వృద్ధుల వరకు అందరూ థియేటర్లకు తరలివచ్చి సినిమాను ఆశీర్వదించడం సంతషంగా ఉందని సామ్ పేర్కొంది. సాధారణంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కేవలం పురుష ప్రేక్షకుల వల్లే వస్తాయనే నమ్మకాన్ని మార్చుతూ, ఈ చిత్రానికి మహిళలు భారీగా తరలివచ్చారని ఆమె తెలిపింది.
తొలిరోజు కలెక్షన్లలో మహిళల పాత్ర ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందని.. తమ చిన్న ప్రొడక్షన్ హౌస్ ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం గర్వంగా ఉందంటూ సామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారయణన్ సంగీతం అందించారు.



