చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి లేదు – సమంత

స్టార్ హీరోయిన్ సమంత ‘రంగస్థలం’ చిత్రంతో తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సినిమాలో రామలక్ష్మి పాత్రలో ఆమె కనబర్చిన నటన ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. సినిమా విజయంలో ఆమె పాత్ర కూడ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటి సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో సమంత మాట్లాడుతూ ఈ సక్సెస్ చూస్తుంటే తనకు చాలా తృప్తిగా ఉందని ఎందుకంటే టీమ్ పడిన కష్టాన్ని తాను చూశానని, అనుకున్నదానికంటే పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని అన్నారు. అలాగే ఎప్పటికీ మర్చిపోలేని పాత్రను ఇచ్చిన సుకుమార్ థ్యాంక్స్ అని చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి లేదని, అంత మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిన చరణ్ కు కృతజ్ఞతలని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.