స్పెషల్ సాంగ్ తో అంచనాలు పెంచేసిన సమంత !
Published on Sep 4, 2018 9:31 am IST

సమంత ప్రధాన పాత్రలో పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం యు టర్న్ . ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది చిత్ర బృందం. ఇప్పటికే ఈసినిమా విడుదల హక్కులను మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని మరింత గా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు.

‘కర్మ థీమ్’ అంటూ వచ్చిన ఈ సాంగ్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ఈ సాంగ్తో సినిమాపై అంచనాలు పెంచడంలో సమంత విజయం సాధించింది. ఇప్పుడు ఈసినిమా విడుదల కోసం పేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక , ఆది పినిశెట్టి ,రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు ,తమిళ భాషల్లో సెప్టెంబర్ 13న విడుదలకానుంది.

  • 7
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook