సమంత తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టి ఎనిమిది ఏళ్ళు అయ్యింది. ఆమె మొదటి సినిమా నుండి చిన్మయి తనకు డబ్బింగ్ చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు సమంత మొదటిసారి తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అది కూడ ‘మహానటి’ సినిమా కోసం. ప్రస్తుతం ఈ డబ్బింగ్ పనులు హైదరాబాద్లో జరుగుతున్నట్లు సమాచారం.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించబోతోంది. దుల్గర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్ బాబు, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ వంటి నటులు ఈ సినిమాలోని పలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మార్చిలో విడుదలకావాల్సిన ఈ సినిమా కాని కొన్ని అనివార్య కారణాల వలన మే నెలకు వాయిదా పడింది.
