
మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందడమే కాకుండా ఎంతోమంది యువతకి డ్రీం గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస హిట్ అందుకొని టాప్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం తెలుగు కంటే తమిళ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని ఇది వరకే తెలిపాము.
ఇప్పటికే తెలుగు సినిమాలను తగ్గించిన ఈ భామ తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్య సరసన సినిమాలు చేస్తోంది. సెట్స్ పైన ఉన్న ఈ రెండు సినిమాలు కాకుండా విక్రమ్ సరసన ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉదయనిది స్టాలిన్ హీరోగా అహ్మద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘ఎన్డ్రెండ్రుం పున్నాగై’ సినిమా కోసం సమంతతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సమంత ప్రస్తుతం తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’, వివి వినాయక్ ‘అల్లు శ్రీను’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా తను చేసిన ‘మనం’ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది.

