ప్రేమంటే ఏంటి? సమంత మాటల్లో.

ప్రేమంటే ఏంటి? సమంత మాటల్లో.

Published on Jul 5, 2014 6:05 PM IST

samantha
సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్స్’. మారుతి సమర్పణలో మారుతి టాకీస్, మాయాబజార్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నగవంశి, మహేంద్ర బాబు నిర్మాతలు. జెబి స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో శుక్రవారం సాయంత్రం వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత, ఎమ్మెస్ రాజు తదితర సినిమా ప్రముఖుల సమక్షంలో జరిగింది.

ఆడియో వేడుకలో సమంత సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రేమంటే ఏంటి? అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమంత చెప్పిన సమాధానం ఆమె ఎంత తెలివైందో.! ప్రేక్షకులకు చాటిచెప్పింది. నిజజీవితంలో మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా..? అనే ప్రశ్నకు ‘మీకు అంత నమ్మకం ఉందా.. నేను ఇక్కడ(స్టేజ్) నిజం చెప్తానని..? అని బదులిచ్చింది.

సమంత ఒక యువ హీరోతో ప్రేమలో ఉందని గత కొంత కాలంగా వార్తలు, పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత ఇప్పుడు నిజం చెప్పకపోవడంతో పాటు దాచేసింది కూడా. ఇంతకి అమ్మడు ప్రేమలో పడిందా? లేదా? వెయిట్ & సి

తాజా వార్తలు