‘యూ టర్న్’ ఆడియో డేట్ ను రివీల్ చేసిన సమంత !

Published on Aug 13, 2018 12:09 pm IST

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత సినిమాలను కంటిన్యూ చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. కాగా ‘నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చైతుతో కలిసి ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యూ టర్న్. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.

కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ ఒకే సారి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియోను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు సమంత తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More