‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా, ‘ప్రేమ కథాచిత్రమ్’ తో అందరినీ ఆకట్టుకున్న నందిత హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘లవర్స్’. చిన్న సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి సమర్పణలో రానున్న ఈ సినిమాకి హరినాథ్ డైరెక్టర్. ఈ సినిమా ఆడియో ముందుగా అనుకున్న దాని ప్రకారం జూన్ 28న విడుదల కావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని జూలై 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియోని సమంత చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేయనున్నారు. కమెడియన్ సప్తగిరి పాత్ర సెకండాఫ్ లో హైలెట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.


