వైరల్..తారక్ షో లో అదిరే అమౌంట్ నెగ్గిన సమంతా?

Published on Oct 8, 2021 9:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి తన గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షో లో సామాన్య ప్రజలతో పాటు మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు పలువురు సినీ తారలు కూడా షో కి ప్రత్యేక అతిధులుగా హాజరు అవుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ ఈసారి స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ షో కి ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యిందని ఇటీవల టాక్ రాగా అది నిజమే అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కూడా పూర్తయ్యిపోవడమే కాకుండా అదిరే అమౌంట్ ని కూడా సామ్ గెలుచుకున్నట్టు తెలుస్తుంది.

ఆమె మొత్తం 25 లక్షలు వరకు గెలుచుకుందట. 25 లక్షల ప్రశ్న వరకు సామ్ వెళ్లిందంటే తాను ఎలా ఆడిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అన్నది కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :