స్టార్ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల ఖుషి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. తాజాగా సిటాడెల్ అనే సిరీస్ చేస్తున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడేందుకు పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. తద్వారా మానసిక పొందుతున్నానని, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తున్నారు సమంత.
ఇక తాజాగా మలేషియాలో ఉన్న సమంత అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ దిగిన పలు పిక్స్ ని కొద్దిసేపటి క్రితం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా అందులో సమంత బికినీ లో దిగిన ఒక పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతోంది. ఇక త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నారు సమంత.