అందంతో యువ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాక నటనతో అందరినీ ఆకట్టుకున్న సమంతలో మానవీయత ఎక్కువ పాళ్ళలో వుందని మనకు తెలిసిన విషయమే. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు ‘ఫుడ్ ఫర్ చేంజ్’ అనే సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది
‘ప్రాజెక్ట్ 511’ అనే సంస్థతో ఇప్పటికే ఎన్నో మంచిపనులు చేస్తున్న ఈ భామకి ఇప్పుడు ఈ కొత్త ఆర్గనైజేషన్ ద్వారా పేదవారికి చదువు చెప్పించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం వచ్చింది. సమాంత చేస్తున్న ఈ మంచిపనులను చూసి అందరూ ఆమెపై ప్రశంసల జల్లులను కురిపిస్తున్నారు


