టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ యొక్క ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ పౌరాణిక ఇతిహాసం శాకుంతలం చిత్రం మీద నటి సమంత చాలా ఆశలు పెట్టుకుంది. అయితే, గత వారం విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఘోరం గా విఫలమైంది. ఇప్పటివరకు 8.10 కోట్ల రూపాయల గ్రాస్ నుండి 3.90 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేయగలిగింది. శాకుంతలం పై ప్రేక్షకుల తీర్పును సమంత అంగీకరించింది.
ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. కర్మణ్యే వాధికా రాస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంఘోత్స్వ కర్మణి అని రాసుకొచ్చింది. సమంత తన తదుపరి ప్రాజెక్ట్ అయిన రుస్సో బ్రదర్స్ యొక్క అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్, సిటాడెల్. రాజ్ మరియు DK దీనిని తెరకెక్కించనున్నారు. ఆయుష్మాన్ ఖురానా సరసన తన తొలి బాలీవుడ్ సినిమాకి కూడా సంతకం చేసింది సమంత. ఆమెకు తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ చిత్రం కూడా ఉంది.
https://www.instagram.com/p/CrKq8YHoka_/


