ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న సమంత మాస్ అవతార్

ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న సమంత మాస్ అవతార్

Published on Aug 3, 2014 10:49 PM IST

samantha

సౌత్ లో బాగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ మరియు ఎంతో మంది యువతకి డ్రీం గర్ల్ సమంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా క్లాస్ గా, బబ్లీగా, పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలే చేసిన సమంత మాస్ పాత్రలు, గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండేది. మాగా అయితే ఒకటి లేదా రెండు సాంగ్స్ లో మాస్ లుక్ లో కనిపించేది.

ప్రస్తుతం సమంత నుంచి వస్తున్న సినిమాలు చూస్తుంటే క్లాస్ బబ్లీ పాత్రలకి కాస్త గ్యాప్ ఇచ్చి ఫుల్ గా మాస్ అండ్ గ్లామరస్ పాత్రలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉంది. దానికి ఉదాహరణగా తను చేసిన ‘అల్లుడు శీను’, ‘రభస’, ‘సికందర్’ సినిమాలని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల్లో తన కాస్ట్యూమ్స్, పాత్రలు ఎక్కువగా మాస్ గా ఉండడమే కారణం.

సమంతలోని ఈ న్యూ యాంగిల్ ఫ్యాన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ లో సమంతని చూడడం కోసం అభిమానులు ఆన్ లైన్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ రిజల్ట్ తో సమంత తన కెరీర్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు