“యశోద” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే!

“యశోద” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే!

Published on Nov 14, 2022 3:01 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. నిర్మాతలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా ఎక్కడా కూడా స్లో అయ్యే అవకాశం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. పాన్ ఇండియన్ మూవీ యశోదలో ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, కల్పిక మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. హరి, హరీష్‌లు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు