సమంత “యశోద” ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్

Published on Apr 28, 2022 6:04 pm IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పలు వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ రోజు సమంత పుట్టిన రోజు కావడం తో పలు చిత్రాలకు సంబందించిన అప్డేట్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె తదుపరి చిత్రం యశోద మేకర్స్ ఓ అప్‌డేట్‌ని విడుదల చేశారు.

యశోద చిత్రం ఫస్ట్ గ్లింప్స్ మే 5, 2022న ఉదయం 11:07 గంటలకు విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. దానిని తెలియజేసేందుకు ఆన్‌లైన్‌లో చిన్న వీడియోను విడుదల చేశారు. హరి, హరీష్‌లు దర్శకత్వం వహించిన ఈ బహుభాషా ప్రాజెక్ట్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :