‘యశోద’ అది పూర్తి చేసుకుంది.. కానీ విడుదలే ఆలస్యం!

Published on Jul 11, 2022 2:00 pm IST

సమంత ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ‘యశోద’ చిత్రం ఈ రోజుతో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. కాకపోతే.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. నిర్మాణానంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం పడుతుందని, అందుకే.. విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్‌ లో కూడా విడుదల తేదీ లేదు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌ కు తగ్గట్టు రూపొందుతున్న చిత్ర‌మిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్‌లు దర్శకత్వం వహించిన ఈ బహుభాషా ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :