పదహారేళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’

Samara-Simha-Reddy
ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ కి నాంది పలికిన చిత్రం ‘సమరసింహా రెడ్డి’. ఈ చిత్రం సృష్టించిన ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. ఈ చిత్రం నేటి తో పదహారేళ్ళు పూర్తి చేసుకుంది. బాల కృష్ణ నటించిన పాత్ర కి ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఒక వైపు పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా మరో వైపు ఒక మామూలు యువకుడిగా బాలకృష్ణ అభినయానికి ప్రశంసలు లభించాయి.

బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తర్వాత ఎన్నో ఫ్యాక్షన్ చిత్రాలు వరుసగా వచ్చాయి. అపట్లో బాల కృష్ణ చిత్రాల్లోనే బాక్స్ ఆఫీసు దగ్గర అత్యధిక మొత్తం సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం లో సిమ్రన్ అంజలా జవేరి హీరోయిన్ లుగా నటించారు.

Exit mobile version