హీరో కార్తీకేయ చేతుల మీదుగా ‘సమయమే తెలియదే’ !

Published on Mar 1, 2020 1:00 pm IST

‘సమయమే తెలియదే ఏమో ఏమో నీతో ఉంటుంటే..సమయమే గడవదే ఏమో ఏమో నువ్వే లేకుంటే… ఇలాంటి అందమైన సాహిత్యంతో కూడిన రొమాంటిక్ గీతానికి ఆహ్లాదకరమైన సంగీతం జోడయితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి పాటే ఆవిష్కృతమైంది. యాంకర్ రవి, తనూజ గౌడ లపై చిత్రీకరించిన ఒక ప్రైవేట్ సాంగ్ ఇది. న్యూ టాలెంట్ ని ప్రోత్సహించే బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని మనకు అందించింది. సత్య సాగర్ పొలం రచించి సంగీతం అందించారు. సింగర్స్ హేమ చంద్ర, మౌనిక రెడ్డి చక్కగా ఆలపించిన ఈ పాటకు చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటను ఫిబ్రవరి 29న ప్రసాద్ లాబ్స్ లో జరిగిన కార్యక్రమానికి హీరో కార్తీకేయ ముఖ్య అతిధిగా పాల్గొని ఈ పాటను విడుదల చేశారు.

అనంతరం హీరో కార్తికేయ మాట్లాడుతూ – ఈ పాట టీజర్ చూడగానే నచ్చి షేర్ చేశాను. ఇప్పుడు ఫుల్ సాంగ్ చూడగానే ఇంకా నచ్చింది. ముఖ్యంగా రవి, తనూజ ఇద్దరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. రవి నాకు చాలా కాలంగా తెలుసు. చాలా హార్డ్ వర్కర్. తప్పకుండా ఈ పాట పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ లో మంచి కంటెంట్ ని ప్రోత్సహించి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ కి నా అభినందనలు. ఇది ఎంతో మంది నూతన ఔత్స్థాహితులకి తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నారు,

యాంకర్ రవి మాట్లాడుతూ – మా నాన్న గారికి నేను ఇలా కూడా చేయగలుగుతాను అని ప్రూవ్ చేయడానికి ఈ సాంగ్ చేశాను. దాంతో పాటు నటుడు అంతే అన్ని చేయగలగాలి. తప్పకుండా ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. చిట్టి మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు. మా పాటను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన కార్తికేయ గారికి స్పెషల్ థాంక్స్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన బ్ల్యూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ కి కృతజ్ఞతలు” అన్నారు.
నోయెల్ సీన్ మాట్లాడుతూ – సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

సంబంధిత సమాచారం :

More