సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రెండు సినిమాలూ ఈరోజే స్టార్ట్.!

సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రెండు సినిమాలూ ఈరోజే స్టార్ట్.!

Published on Jun 24, 2021 2:00 PM IST

మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఒకటి.మరి వీరి నుంచి వస్తున్న చిత్రాల్లో రెండు సినిమాలు ఈరోజు నుంచే హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనున్నాయి. మొదటగా యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘ చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది.

చిత్ర నాయకా, నాయికలు. ‘నాగ శౌర్య ,రీతువర్మ’ లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతం తో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

ఇక ఈ చిత్రానికి నిర్మాత: సూర్య దేవర నాగవంశి, మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ లు అందిస్తున్నారు.

ఇక మరో చిత్రానికి వస్తే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ఇదే ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం. హైదరాబాద్ లో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది. కథానాయకుడు సిద్దు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని, పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: విమల్ కృష్ణ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు