హోస్ట్ గా మారబోతున్న మరో మాజీ హీరోయిన్.. !

Published on Nov 30, 2020 1:09 pm IST

మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. పైగా దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. అటు నుండి బాలీవుడ్ పోయి, అక్కడా కొన్ని సినిమాల్లో కనిపించి మొత్తానికి హీరోయిన్ గా సక్సెస్ అయింది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలు సమీరా రెడ్డి కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తాయి. కాగా సమీరా రెడ్డి ప్రస్తుతం హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాలకు దూరం అయింది.

కాగా పెళ్ళయ్యాక పూర్తిగా సినిమాలను దూరం పెట్టేసినా.. సమీరా రెడ్డి సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రావడం… తమిళంలో ఆర్య, విశాల్ కలిసి చేయనున్న కొత్త చిత్రంలో సమీరా రెడ్డి ముఖ్యమైన లేడీ విలన్ పాత్రను చేస్తుందనే వార్త బాగా వైరల్ అవ్వడంతో.. ఈ వార్త పై సమీరా రెడ్డి స్పందించి ఈ సినిమా చేయట్లేదని.. తనకు సినిమాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశ్యం లేదని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా సమీరా రెడ్డి కొత్త అవతారం ఎత్తబోతునట్లు తెలుస్తోంది. ఓ హిందీ ఛానెల్ కోసం త్వరలోనే సమీరా రెడ్డి హోస్ట్ గా చేయబోతుందట. ఇంతకీ సమీరా రెడ్డి హోస్ట్ గా చేస్తోంది ఎలాంటి షోకి అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.

సంబంధిత సమాచారం :

More