సాంగ్ తో అంచనాలను పెంచేసిన ‘సామీ స్క్వేర్’ !
Published on Aug 23, 2018 1:10 am IST

తమిళ స్టార్ హీరో విక్రమ్, త్రిషలు జంటగా దర్శకుడు హరి రూపొందించిన చిత్రం ‘సామి’. 2003లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్. తాజాగా ఈ చిత్రం నుండి దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.

అతి సుందరా..సుమనోహరా..అంటూ సాగే ఈ పాట సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచింది. విక్రమ్-కీర్తి సురేష్ ల మీద పిక్చరైజ్ చేసిన ఈ పాటలో ఇనుస్ట్రుమెంటేషన్ కూడా కొత్తగా వుంది. కాగా సెప్టెంబర్లో వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook