హీరో సుధీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘సమ్మోహనం’. ‘జెంటిల్మెన్స్, అమీ తుమీ’ వంటి సినిమాలతో వరుస హిట్లందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ముగిసింది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేశారు.
‘సమ్మోహనం’ అనే క్లాసిక్ టైటిల్ తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి కథానాయకిగా నటిస్తోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. జూన్ 15వ తేదీన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకురానుంది.


