హాఫ్ మిలియన్ దిశగా ‘సమ్మోహనం’ !
Published on Jun 18, 2018 5:56 pm IST

గత వారం విడుదలైన చిత్రాల్లో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరిల ‘సమ్మోహనం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది. వేరే పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. కుటుంబ ప్రేక్షకులంతా ఈ చిత్రం వైపే మొగ్గుచూపుతున్నారు. ఓవర్సీస్లోనూ ఇదే పరిస్థితి. మొదటి రోజు మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఈ సినిమా హాఫ్ మిలియన్ దిశగా వెళుతోంది.

ప్రీమియర్ల ద్వారా 67,636 డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు 94,150 డాలర్లు, శనివారం 140,222 డాలర్లను, ఆదివారం 96, 614 డాలర్లు వసూలు చేసి మొత్తంగా 398,878 డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం హాఫ్ మిలియన్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే శుక్రవారం కూడ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ రన్ ఇలాగే కొనసాగవచ్చు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook