‘సమ్మోహనం’ లేటెస్ట్ కలక్షన్స్ !

‘సమ్మోహనం’ లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Jun 26, 2018 4:00 PM IST

sammohanam

సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ఏ సెంటర్లలో మంచి రన్ ను కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.6. 5 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.

ఇక ఈ చిత్రం ఈ శుక్రవారం నుండి పెద్ద పరీక్షనే ఎదురుకోనుంది. ఎందుకంటే ఆ రోజు ఏకంగా తెలుగులో 7 సినిమాలు విడుదలకానున్నాయి. మరి వీటన్నిటితో పోటీపడి ధీటుగా కలెక్షన్స్ ను రాబడితే డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు ఖాయం. ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. శ్రీ దేవి మూవీస్ పతాకం ఫై శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు