సమ్మోహనం మొదటి వారం కలక్షన్స్ !

సమ్మోహనం మొదటి వారం కలక్షన్స్ !

Published on Jun 23, 2018 12:00 AM IST


సుధీర్ బాబు , అతిధి రావ్ హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సమ్మోహనం .ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ని సొంతం చేసుకొని దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది . ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాల విడుదల లేనందున మరి కొన్ని రోజులు ఈ చిత్ర కలెక్షన్స్ కు ఎలాంటి నష్టం కలుగక పోవచ్చు .

ఇక మొదటి వారంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు . సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలో నటించిన ఈచిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు