‘సమ్మోహనం’ ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తుంది – చిరంజీవి

‘సమ్మోహనం’ ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తుంది – చిరంజీవి

Published on May 2, 2018 12:38 PM IST

సుధీర్ బాబు, అదితిరావు హైదరిలు జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ నిన్ననే విడుదలైంది. టీజర్ కొత్తగా ఉంది అంటూ ప్రేక్షకుల నుండి ప్రసంశలు అందుతుండగా విడుదలకు ముందే టీజర్ ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవిగారు కూడ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

టీజర్ చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉందని, చూస్తుంటే సినిమా మంచి లవ్ స్టోరీలా ఉంటుందని అనిపిస్తోందని, ‘సమ్మోహనం’ అనే టైటిల్ కు తగ్గట్టే చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తుందని, ఈ చిత్రం సుధీర్ బాబుకు ఒక మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేశారు. జూన్ 15వ తేదీన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు