సంపత్ నంది – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో !

సంపత్ నంది – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో !

Published on Jul 3, 2019 7:02 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా పోయిన ఏడాదే ఓ సినిమా చేయాలనుకున్నారు. అయితే సంపత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చక గోపీచంద్ సంపత్ సినిమాకి కాస్త దూరంగా జరిగాడు. ఇక ఆ సినిమా క్యాన్సల్ అవడంతో.. సంపత్ నంది అదే స్క్రిప్ట్ తో నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఫుల్ స్క్రిప్ట్ ను ఇటీవలే కళ్యాణ్ రామ్ కి చెప్పాడట. సంపత్ చెప్పిన కథ కళ్యాణ్ రామ్ బాగా నచ్చిందట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి సంపత్ నంది, కళ్యాణ్ రామ్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో అలాగే సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు