ఇంటర్నెట్ సంచలనం సంపూర్నేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న రెండవ సినిమా ‘కొబ్బరిమట్ట’ ముహూర్తం కుదిరింది, ఆగస్ట్ 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు హీరో తెలిపారు. ‘కొబ్బరిమట్ట’లో సంపూర్నేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. సంపూ సరసన 7గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సంపూర్నేష్ బాబుతో ‘హృదయ కాలేయం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాత స్టీవెన్ శంకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోసారి స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహిస్తారా..? లేక వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం సంపూర్నేష్ బాబు అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న ‘బందిపోటు’ సినిమాలో కీలక పాత్ర నటిస్తున్నారు.


