పవన్ రిప్లైను ఫ్రేమ్ కట్టించుకుంటా అంటున్న హీరో.!

నిన్న టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఎందరో సినీ తారలు సహా రాజకీయ నాయకులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలా తెలిపిన ప్రతీ ఒకరికి కూడా పవన్ తన రిప్లై ను చాలా మర్యాదపూర్వకంగా తెలిపారు. అలా తెలిపిన వారిలో మన టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు పవన్ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై రిప్లై ఇచ్చారు.

అయితే ఈ రిప్లై చూసి సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పట్టరాని ఆనందంతో ఏకంగా పవన్ ఇచ్చిన రిప్లై ను తన ఇంట్లో ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటానని తెలిపారు. మీ దగ్గర నుంచి రిప్లై రావడం చాలా ఆనందంగా మాటలు రాలేని విధంగా ఉందని తెలుపుతూ సంపూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సంపూ తో పాటుగా పవన్ మరింత మంది యువ నటులకు తన రిప్లై ఇచ్చారు. వారి రియాక్షన్ కూడా ఇలానే ఉంది.

Exit mobile version