సంపూ చేతనైన సాయం చేశాడు…!

Published on Aug 13, 2019 11:17 pm IST

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సంపూ కామెడీకి సర్వత్రా ప్రశంసలందుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ చిత్రం 3కోట్ల వరకు వసూళ్లు సాధిచిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఐతే సంపూర్ణేష్ బాబు ఉత్తర కర్ణాటకలో వరద బాధితులకు తన వంతు సాయంగా రెండు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

ఈ సంధర్బంగా “ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను. అని ట్వీట్ చేశారు. కొద్దిపాటి ఆదాయం కలిగిన అతి చిన్న హీరో సంపూ చేసిన సాయం చాలా పెద్దదే అని చెప్పాలి. సంపూ గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కొరకు వైజాగ్ వేదికగా నిరసన తెలుప ప్రయత్నించారు.

Turn off for: Telugu

సంబంధిత సమాచారం :