సంపూర్ణేష్‌ బాబు ‘క్యాలీ ఫ్లవర్‌’కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సంపూర్ణేష్‌ బాబు ‘క్యాలీ ఫ్లవర్‌’కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Apr 7, 2022 1:27 AM IST

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా, ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’ .‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గూడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం గతేడాది నవంబరు 26న థియేటర్లలో విడుదలై ఫ్యామిలీ మరియు కామెడీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ఏప్రిల్‌ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా మొదలగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ థియేటర్స్‌లో ‘క్యాలీఫ్లవర్’ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులందరూ ఈ నెల 9నుంచి ఓటీటీలో వీక్షించాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు