తన మొదటి సినిమా రిలీజ్ కాక ముందు నుంచే బర్నింగ్ స్టార్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో సంపూర్నేష్ బాబు. సంపూర్నేష్ బాబు చేసిన ‘హృదయ కాలేయం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అడపా దడపా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సంపూర్నేష్ హీరోగా సినిమాలు చేస్తూనే అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘బందిపోటు’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ బందిపోటు సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ ‘నరేష్ గారి బందిపోటులో నేను భాగస్వామ్యం కావడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అల్లరి నరేష్, తనికెళ్ళ భరణి గారు షూటింగ్ టైంలో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ మోహన కృష్ణ గారు ఈ స్క్రిప్ కి తగ్గట్టుగా నా యాక్టింగ్ ని కరెక్ట్ చేసారని’ అన్నాడు. ఈశ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నరేష్ – రాజేష్ కలిసి నిర్మించారు. సపూర్నేష్ బాబు ఈ సినిమా కాకుండా విష్ణు ప్రొడక్షన్ లో ‘సింగం 123’ సినిమా చేస్తున్నాడు.


