ఆర్ఆర్ఆర్ లో ప్రముఖ తమిళ నటుడు !

Published on Dec 20, 2018 12:13 am IST

అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నమల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈచిత్రం యొక్క రెండవ షెడ్యూల్ జనవరి 19నుండి 5 రోజులపాటు హైద్రాబాద్లో లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగనుందని సమాచారం.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని, చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడట. కోలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :