సానా యాదిరెడ్డి దర్శకత్వంలో క్రికెటర్ శ్రీశాంత్!

సానా యాదిరెడ్డి దర్శకత్వంలో క్రికెటర్ శ్రీశాంత్!

Published on Jun 20, 2015 4:37 PM IST

Sri-Santh-Sanayadireddi
క్రికెటర్‌గా తన కెరీర్లో కొంత అనిశ్చితి వచ్చాక కొన్నాళ్ళకు కఆ ఫీల్డ్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీశాంత్, సినిమాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే! ఆ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ద్విభాషా చిత్రాన్ని చేసేందుకు సిద్ధమైపోయారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

గతంలో పిట్టల దొర, సంపంగి, బ్యాచిలర్స్ చిత్రాలని నిర్మించిన సానా యాదిరెడ్డి శ్రీశాంత్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోంది? ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు లాంటి విషయాలతో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. మరి క్రికెటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకున్న శ్రీశాంత్, హీరోగా ఎలాంటి సినిమా చేస్తాడా? ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!

తాజా వార్తలు